14, జులై 2016, గురువారం

జాతీయ విపణిలో రైతే రాజు!

‘జీఎస్‌టీ’ అమలైతే మరింత మేలు 
వస్తు సేవల బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి నోచుకోకుండా చాలాకాలంగా రాజ్యసభలో మగ్గుతోంది. తమిళనాడు మినహా దేశంలోని రాష్ట్రాలన్నీ (కాంగ్రెస్పాలిత రాష్ట్రాలు సహా) జీఎస్టీపట్ల సుముఖత వ్యక్తం చేశాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కారుభారత్లో తయారీవంటి నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలకు పురుడుపోస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతటా సరళమైన, సులువైన పన్నుల వ్యవస్థ అత్యవసరం. క్రమంలో సాధ్యమైనంత సత్వరం జీఎస్టీని పట్టాలకెక్కించాల్సి ఉంది. విభేదాలను పక్కనపెట్టి పాలక, ప్రతిపక్షాలు విషయంలో దేశ హితం దృష్ట్యా ఒక్క తాటిమీదకు రావాలి. జీఎస్టీ అమలైతే దేశమంతటా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, పంపిణీకి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. పండించిన పంటకు మెరుగైన ధర అందుకునే అవకాశమూ రైతన్నలకు దక్కుతుంది.
వినియోగదారులకు అనుకూలం
వస్తు సేవల సరఫరాను ఏకీకృత పన్నుల వ్యవస్థ కిందకు తీసుకురావడమే జీఎస్టీ లక్ష్యం. క్రమంలో కేంద్రం విధించే అన్ని పరోక్ష పన్ను(ఎక్సైజ్డ్యూటీ, కౌంటర్వేలింగ్డ్యూటీ, సేవా పన్ను)లను, రాష్ట్రాల స్థాయిలో విధించే పరోక్ష పన్ను(వ్యాట్‌, విలాస పన్ను, ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్వంటి)లను ఒకే ఛత్రం కిందకు తీసుకువచ్చి జీఎస్టీని రూపొందించారు. సరఫరా గొలుసులో వివిధ దశల్లో చెల్లించిన పన్నులను మినహాయించి ఎక్కడికక్కడ నికరంగా చెల్లించాల్సిన పన్నును మాత్రమే వసూలు చేస్తారు. ప్రతి దశలోనూ జతపడే అదనపు విలువపై చెల్లించే పన్ను ఇది! దీనివల్ల సరఫరా గొలుసులో చిట్టచివరన ఉండే వినియోగదారుడిపై భారం తగ్గుతుంది. రాష్ట్రాల రెవిన్యూ ఆదాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండానే దేశవ్యాప్తంగా ఏకరూప సరళ పన్ను విధానానికి జీఎస్టీ తెరతీస్తుంది. ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జాతీయ వ్యవసాయ విపణి ద్వారా రైతులందరికీ అద్భుతమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
ఏకీకృత పన్నురేట్ల విధానం- సానుకూలతలు
1. బహుళ పన్నుల వ్యవస్థను మార్చి ఏకీకృత విధానం ద్వారా ఒకే ఛత్రం కిందకు తీసుకురావడం ద్వారా జాతీయ స్థాయిలో ఉమ్మడి విపణి ఏర్పాటు సులభమవుతుంది.
2.
పన్ను పరిధి విస్తరించడం, నిబంధనలు సరళంగా ఉండటంవల్ల దేశవ్యాప్తంగా పన్ను రెవిన్యూ ఇనుమడిస్తుంది.
3.
ఉత్పత్తి ఖర్చులు తగ్గడంవల్ల ఎగుమతులు పెరుగుతాయి.
4.
పన్నుల భారం తగ్గడంవల్ల వివిధ వస్తువులు చౌకగా అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు మేలు చేకూరుతుంది.
పన్నుల విధింపు, వసూళ్లపై తాము నియంత్రణ కోల్పోయి, రెవిన్యూకు భారీగా కోతపడుతుందేమోనని భయపడి తొలుత అనేక రాష్ట్రాలు జీఎస్టీకి వెనకాడిన మాట వాస్తవం. జీఎస్టీ లోటుపాట్లపై చట్టసభల్లోనూ, దేశంలోని అనేక బహిరంగ వేదికలపైనా విస్తృత చర్చలు జరిగాయి. నేపథ్యంలో రెవిన్యూ నష్టాలు, ఆర్థిక క్రమశిక్షణ వంటివాటిపై రాష్ట్ర సర్కార్ల అనుమానాలు తొలగిపోయాయి. వివిధ రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యంతో తలపెట్టిన జాతీయ ఉమ్మడి వ్యవసాయ విపణికి సంబంధించీ ఇదే తరహా కృషి జరగాల్సి ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల స్వేచ్ఛా ప్రవాహంవల్ల రాష్ట్రాల అధికారాలకు ఎలాంటి గండి పడదన్న విషయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించాల్సి ఉంది. ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్లను ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధిపరచిన ఎలక్ట్రానిక్ప్లాట్ఫామ్కి అనుసంధానించడం ద్వారా అవకాశాలు వెల్లువెత్తి రైతులు, వ్యాపారులు లాభపడతారు. పారదర్శక విపణి వ్యవస్థ ద్వారా తమ ఉత్పత్తులను గరిష్ఠంగా ఎంత ధరకు విక్రయించవచ్చో రైతులకు తెలుస్తుంది. ప్రాంతీయ విపణులు జాతీయ మార్కెట్తో అనుసంధానవుతాయి. రైతులు తీసుకువచ్చిన ఉత్పత్తుల నాణ్యతను విపణుల్లో నిర్ధారిస్తారు. క్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్విభాగాలు స్థానికంగా చాలినన్ని శాస్త్రీయ గ్రేడింగ్పరిశోధనశాలలను రైతులకు అందుబాటులో ఉంచాలి. అప్పుడు రైతులు, వ్యాపారులు దేశంలో ఎక్కడినుంచైనా వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో పాల్గొని, ఎలక్ట్రానిక్పద్ధతిలోనే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఏర్పడుతుంది. ఆలోచనను మరింత విస్తరించి వివిధ మార్కెట్లు, సేవలు, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా వ్యవస్థలు, ఆర్థిక సంస్థలను ఏక ఛత్రం కిందకు తీసుకువచ్చే అవకాశాలనూ అన్వేషించాల్సి ఉంది. ఉమ్మడి వ్యవసాయ విపణి ఆవిష్కారంవల్ల దళారుల మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. రైతుల కష్టాలకు చెల్లు చెప్పవచ్చు. పన్ను చెల్లించకుండా ఒక్కరికీ లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు. పన్నుల వ్యవస్థలో చిల్లులు పూడ్చేందుకూ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఏక విపణి వ్యవస్థను సమర్థంగా పట్టాలకు ఎక్కించాలంటే మాత్రం రాజకీయ దృఢ సంకల్పం తప్పనిసరి. రైతులు, వ్యాపారులు, కమిషన్ఏజెంట్లు, బ్యాంకర్లు, శీతల గిడ్డంగుల నిర్వాహకులు, ఎగుమతి-దిగుమతిదారులు, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. క్రమంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు కొట్టిపారేయలేనివి.
వ్యవసాయ మార్కెటింగ్నిబంధనలు, నిర్వహణ, కార్యాచరణల్లో ఏకరూపత లక్ష్యంగా 2003లో భారత ప్రభుత్వం ఒక నమూనా చట్టం రూపొందించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించింది. కానీ, వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యం పరిమితంగా ఉండటంవల్ల అన్ని ప్రాంతాల్లోనూ సంస్కరణలు ఆనాటికి సవ్యంగా పట్టాలకెక్కలేదు. ఫలితంగా చట్టం అప్పట్లో చెప్పుకోదగిన విజయం సాధించలేకపోయింది. మోదీ ప్రభుత్వం తలపెట్టిన జాతీయ వ్యవసాయ విపణి నిబంధనల్లో ఏకీకృత లైసెన్సు, ఒకేచోట పన్ను చెల్లించి ఎలక్ట్రానిక్లావాదేవీలు నిర్వహించడం వంటివి ఉన్నాయి. ఉదాహరణకు గుంటూరు మార్కెట్యార్డులో మిర్చి వ్యాపారి చేసే ప్రతి లావాదేవీ జాతీయడేటాలో నమోదవుతుంది. వ్యాపారి నుంచి చివరికి కొనుగోలుదారుడికి మిర్చి చేరేవరకూ ప్రతి కార్యకలాపాన్ని పన్నుల యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. ‘నామ్‌’లో భాగస్వామిగా మారితే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న న్యాయ నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలను కొంతమేరకు సవరించక తప్పదు. వివిధ స్థాయుల్లో అధికార యంత్రాంగానికి జీఎస్టీ అమలుపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. పన్నుల వసూలు, నియంత్రణ వ్యవస్థలను ఆధునికంగా తీర్చిదిద్దుకోవడమూ తప్పనిసరి. అందుకోసం ఆయా రాష్ట్రాలు డిజిటల్సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రాల్లో ప్రత్యేక పన్ను బాధ
ప్రతి రాష్ట్రంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కమిటీ (ఏపీఎంసీ) చట్టాలు అమలులో ఉన్నాయి. రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ, సరఫరాలకు చట్ట నిబంధనలు అడ్డుగా నిలిచే ప్రమాదం ఉంది. అవి... పన్నుపరమైన అడ్డంకులు తలెత్తుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల రేట్లలో వ్యత్యాసాలు, ‘వ్యాట్‌’ వర్తింపు, వివిధ కేంద్రాల వద్ద వసూలు చేసే మార్కెట్ఫీజులు వంటివి సమస్యలుగా నిలుస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో సమస్యలు తలెత్తవచ్చు. నిత్యావసర వస్తువులు, చెక్పోస్టులు, ఏపీఎంసీ చట్టాల్లోని నిబంధనలు ఉత్పత్తుల స్వేచ్ఛా ప్రవాహానికి అడ్డంకిగా నిలుస్తాయి.
నిత్యావసర వస్తువుల చట్టం కింద ఉత్పత్తుల సంఖ్యను ప్రస్తుతం 54నుంచి ఏడింటికి తగ్గించారు. వడ్లు, బియ్యం, పప్పు ధాన్యాలు, చక్కెర, వంటనూనెలు, నూనె గింజలు వంటి నిత్యావసర వస్తువులు ధరలు ఆటుపోట్లకు గురికాకుండా వాటి నిల్వపై పరిమితి విధిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, నిల్వలపై నియంత్రణలు సంస్కరణలకు వ్యతిరేకం. దానివల్ల పెట్టుబడులపై ప్రభావం పడటంతోపాటు- దేశంలో స్వేచ్ఛా వాణిజ్యానికీ విఘాతం కలుగుతుంది. జాతీయ స్థాయి వ్యవసాయ విపణి సాకారంకోసం ఏపీఎంసీ, నిత్యావసర వస్తువులు, గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ-అభివృద్ధి చట్టాల్లో తగిన మార్పులు తీసుకురావడం అవసరం. వస్తుసేవల పన్ను అమలులోకి వస్తే- దేశవ్యాప్తంగా వివిధ దశల్లో భిన్న పన్నులు, సుంకాల వసూలుకు తెరపడుతుంది. తద్వారా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు మార్గం సుగమమై, జాతీయ వ్యవసాయ ఏకీకృత విపణి సాకారం సులభమవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక శాతం త్వరగా పాడైపోయేవే! వీటిని సాధ్యమైనంత వేగంగా ఒక ప్రాంతంనుంచి మరోచోటుకు రవాణా చేయాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో దూరప్రాంతాలకు వెళ్ళే ట్రక్కులు తమ ప్రయాణ సమయంలో 60శాతం వివిధ చెక్పోస్టుల దగ్గర తనిఖీలకోసం వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్న పరిణామమిది. ఒక్కోచోట ఒక్కో విధమైన పన్ను చెల్లించే వ్యవస్థకు స్వస్తిపలికి- ఏకీకృత పన్నుల పద్ధతి అమలులోకి తీసుకువస్తే సమస్య పరిష్కారమవుతుంది.
నష్టానికి పరిహారం
దేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై పన్ను విధిస్తున్నాయి. వాటి అమ్మకంపై అభివృద్ధి సుంకం వేస్తున్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రఆక్ట్రాయ్‌’ రూపంలో ఏటా రూ.13,000 కోట్లు సమీకరిస్తోంది. గుజరాత్ఏటా రూ.5,000 కోట్లు సంపాదిస్తోంది. వ్యవసాయ రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణాలు కొనుగోలు పన్ను రూపంలో ఏటా తలా రూ.2,000 కోట్లు వెనకేసుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల ఆదాయానికి జీఎస్టీ అమలువల్ల బొర్రెపడుతుంది. జీఎస్టీ అమలులోకి వచ్చాక కొంతకాలంపాటు వివిధ రాష్ట్రాలకు మేరకు నష్టపరిహారం చెల్లించడమే సబబు! జీఎస్టీ ఆగమనంవల్ల దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 0.61 శాతంనుంచి 1.18 శాతం మధ్య పెరుగుతాయని; మరోవంక తయారీ రంగంలో ధరలు 1.22 శాతంనుంచి 2.53 శాతం మేర పడిపోతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఒకరకంగా వ్యవసాయ విపణికి కొత్త వూపునిచ్చే పరిణామమే. ధరల పెరుగుదలవల్ల ఒనగూడే లబ్ధిని రైతులకు బదలాయించాలంటే సమర్థ వ్యవసాయ మార్కెటింగ్వ్యవస్థలు రూపొందించుకోవాల్సి ఉంది. స్థానికంగా చిరు వ్యాపారులకు మాత్రమే వ్యవసాయ విపణి ఇప్పటిదాకా పరిమితమైంది. కానీ, ‘నామ్‌’ అమలుకు జీఎస్టీ జతకూడితే పెద్ద పెద్ద వ్యవసాయ కంపెనీలు రంగంలోకి దిగి దేశ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్నే మార్చేసే అవకాశం ఉంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి