24, జులై 2016, ఆదివారం

రైతు ఆశల్ని మింగేస్తున్న కలుపు

కలుపు మందు ఇరవయ్యో శతాబ్దపు అద్భుత ఆవిష్కరణలలో ఒకటి. వీటిలో మందును, పంటకు, ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా వేయాలనే అంశాలపై మన రైతులలో అవగాహన పెంపొందిస్తే భారత వ్యవసాయ రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది
- ప్రొఫెసర్.ఎస్‌.రావు, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ నోడల్అధికారి 

సరైన సమయంలో కలుపు తీయకపోవడం
దశలో, ఎంత మోతాదులో కలుపు నివారణ మందులు వాడాలనే అవగాహన లేక రైతులు పది శాతానికి పైగా పంటను, ఏటా రూ.వందల కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నారు. సకాలంలో కలుపును నివారించుకోగలిగితే సాగు వ్యయం తగ్గవడమేగాక అధిక దిగుబడులు సాధించడం తథ్యమంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ నోడల్అధికారి, కలుపు నివారణపై మూడున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్న ప్రొఫెసర్.ఎస్‌.రావు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశోధన పత్రాలు సమర్పించిన డాక్టర్రావు ఇండియన సొసైటీ ఆఫ్వీడ్సైన అవార్డుసహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. కలుపు నివారణపై ఆయన సూచనలు పాఠకులకు ప్రత్యేకం.

కలుపు యాజమాన్యంలో తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు
నేల స్వభావం, వేసే పంట, సాగుచేసే విధానాన్ని బట్టి కలుపు సమస్య వేర్వేరుగా ఉంటుంది. మాగాణిలో ఒక రీతిలో, ఎర్రనేలల్లో మరో తీరులో సమస్య ఎదురవుతుంది. తదనుగుణంగా కలుపు యాజమాన్య పద్ధతులు చేపడితే సత్ఫలితాలు వస్తాయి. పంట వేసిన నాటినుంచి కలుపు సమస్య రైతు కంటికి కునుకు లేకుండా చేస్తున్నది. ముఖ్యంగా తుంగ ప్రపంచవ్యాప్తంగా రైతుల్ని కలవరపెడుతున్నది. గతంలో రైతులు కూలీలతో కలుపు తీయించేవారు. ఇప్పుడు కూలీలు దొరకడం లేదు. దొరికినా వారినుంచి పూర్తి స్థాయిలో పని రాబట్టడం పెద్ద సమస్య. కూలీల ఖర్చు విపరీతంగా పెరిగింది. దీంతో రైతులు కలుపు నివారణ మందులపై దృష్టి సారిస్తున్నారు. అయితే, మందులను పంట దశలో, ఎంత మోతాదులో వాడాలి? పంటకు మందు వాడాలి? అనే అవగాహన లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు


ప్రధాన పంటలైన వరి, పత్తిలో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి 180 రోజులకు పైగా సాగయ్యే పంట. పత్తి ప్రాథమిక దశలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పత్తి వేసిన రోజు నుంచి మొదటి 60 రోజుల్లో కలుపు లేకుండా చూసుకుంటే రైతులు మంచి దిగుబడులు సాధించే వీలుంటుంది. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఎరువులు కూడా ఎక్కువ వేస్తారు కాబట్టి కలుపు బాగా పెరుగుతుంది. దీని నివారణకు పత్తి వేసిన రోజు నుంచి 20, 40, 60 రోజులకు ఒకసారి వంతున కలుపుతీస్తే తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. దిగుబడి కూడా పెరుగుతుంది. మాత్రం ఆలస్యం చేసినా రైతు అన్నివిధాలా నష్టపోవాల్సి వస్తుంది. దీంతోపాటు నేల స్వభావాన్నిబట్టి పత్తి సాళ్లలో అడ్డంగా, నిలువుగా రెండుమూడు సార్లు దున్నినా కలుపును చాలా వరకు నివారించే వీలుంటుంది. ఇక వరి 120 రోజుల్లో పండే పంట. మాగాణి వరిలో నాటిన మొదటి ఆరువారాలు కలుపు తీయటానికి కీలక సమయం. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి కలుపు యాజమాన్య పద్ధతులపై అవగాహన లేక మన రైతులు ఎంతో నష్టపోతున్నారు

కలుపు నివారణ మందులు వాడటం వల్ల నేలకు, పంటకు నష్టమనే అభిప్రాయం ఉంది కదా
ఆధునిక పరిజ్ఞానంవల్ల నష్టాలే కాదు ఉపయోగాలు కూడా ఉంటాయి. కలుపు మందులను ఉపయోగించే విధానం తెలుసుకుని సకాలంలో, జాగ్రత్తగా మందుల్ని చల్లడం వల్ల రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు అన్నిరకాల కలుపుమొక్కలు సమపాళ్లలో ఉన్న మాగాణి వరిలో కలుపు నిర్మూలించేందుకు ఎకరాకు 4కిలోల బ్యూటాక్లోర్గుళికలు, నాలుగు కిలోల 2,4-డి ఇథైన ఎస్టర్గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. వరి నాటిన 3 నుంచి 5 రోజులలో విధంగా చేస్తే రైతులు మంచి దిగుబడి సాధిస్తారు. కలుపును కూలీలతో తీయించాలంటే ఎకరాకు మూడు వేలకు పైగానే ఖర్చవుతుంది. కలుపు మందు కోసం కేవలం 300 ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ, ఇదే మందును వేరే పంటలకు వేస్తే మంచికి బదులు దుష్పరిణామాలు ఎదురవుతాయి. సరైన అవగాహనతో ఆధు నిక పరిజ్ఞానాన్ని సరైన సమయంలో ఉపయోగించుకుంటే రైతులు తప్పక లబ్ధి పొందుతారు

కలుపు మందులపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏం చేయాలి?
కలుపును అదుపు చేయలేని కారణంగా మొత్తం దిగుబడిలో పది శాతాన్ని రైతులు నష్టపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే... మన దేశంలో ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు కలుపువల్ల నష్టపోతున్నారన్నమాట. ఆధునిక పరిజ్ఞానం సాయంతో దీన్ని నివారించుకుంటేనే రైతుల ష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కలుపు మందుల వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచడమే అందుకు ఏకైక మార్గం. రైతులకే కాకుండా వ్యవసాయ అధికారులు, ఎరువులు-క్రిమి సంహారక మందుల డీలర్లకు కలుపు నివారణ మందుల వినియోగంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. వీరిని రైతులు తరచూ కలుస్తారు కాబట్టి తాజా సమాచారం వాళ్లద్వారా రైతులకు చేరే అవకాశం ఉంటుంది

అమెరికాలో సదరన వీడ్స్సైన్స్ పరిశోధన కేంద్రంలో ఆధునిక శిక్షణ పొందారు. పలు కలుపు యాజమాన్య పద్ధతుల్ని గమనించారు. అభివృద్ధి చెందిన దేశాలు కలుపు యాజమాన్యంలో ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నాయి?
ఇరవయ్యో శతాబ్దపు గొప్ప ఆవిష్కరణల్లో 1944లో కనుగొన్న కలుపుమందు కూడా ఒకటి. పెరుగుతున్న జనాభాకు అనుగుణ ంగా వ్యవసాయ దిగుబడులను పెంచడంలో కలుపు మందుల పాత్ర గణనీయంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కలుపు మందులను బాగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో తలసరి కలుపు మందుల వినియోగం 20 గ్రాములు కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో 250 నుంచి 500 గ్రాములదాకా ఉంది. జపానలో ఏకంగా రెండు కిలోల కలుపు మందు వాడుతున్నారు. దేశాల్లోని రైతుల్లో అక్షరాస్యత అధికంగా ఉండటం, కలుపు మందుల్ని తట్టుకునే జన్యుమార్పిడి పంటల సాగు ఎక్కువగా ఉండటం కూడా వీటిని విస్తృతంగా వినియోగించడానికి కారణం. కలుపు మందులను ఎలా, ఎప్పుడు, ఎంత మోతాదులో, పంటకు, మందు వేయాలనే అంశాలపై మన దేశంలోని రైతులలోనూ అవగాహన పెంపొందిస్తే వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతి సాధించడం తథ్యం.
(ఆంధ్రజ్యోతి)

ప్రొఫెసర్.ఎస్‌.రావు 

ఆచార్య ఎన.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్అధికారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి