22, ఆగస్టు 2016, సోమవారం

51 గ్రామాల్లో కరవును తరిమేశాడు!

చిన్నారుల ఆకలి మంటలూ, రైతుల ఆకలి చావులతో ఒకప్పుడు వణికిపోయిన నేల ఇప్పుడు పంట పొలాలతో సుభిక్షంగా వర్థిల్లుతోంది. రోజుకి ఒక్కసారైనా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తమ ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిన 51గ్రామాలు, రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి. విజయాలన్నీ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్ఒరేన్అనే శ్రామికుడి కష్టానికి దక్కిన ఫలితమే.

నేను పురస్కారాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. ముఖ్యమంత్రి పల్లెల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరించాలి’... తనకు దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించినప్పుడు సైమన్అన్న మాటలివి. దిల్లీలో పురస్కారం అందుకోవడానికి వచ్చిన ప్రముఖల కోసం ఫైవ్స్టార్హోటల్లో గదులని కేటాయిస్తే, వాటిని వద్దని గిరిజన సంక్షేమ హాస్టల్లో బస చేశాడు సైమన్‌. ‘నా రాష్ట్రంలో రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే, నేను విలాసాలను అనుభవించలేనుఅన్నది ఆయనిచ్చిన సమాధానం. జార్ఖండ్లోని బీడో జిల్లా కక్సిటోలి గ్రామంలో పుట్టిన సైమన్‌, రాష్ట్రపతి భవనం దాకా రావడానికి మధ్యలో మార్చిన జీవితాలూ, సాధించిన విజయాలూ చాలా ఉన్నాయి.

నీటి కష్టాలు మొదలు... 
సైమన్స్వగ్రామం అటవీ ప్రాంతం. చిన్నప్పుడు దళారులు యంత్రాలతో చెట్లను నరుకుతుంటే చూడ్డానికి సైమన్సరదా పడేవాడు. అంత భారీ యంత్రాలు ఒక్క దెబ్బకు చెట్లను నేలకూల్చడం అతడికి ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త పెద్దయ్యాక కానీ అతడికి అర్థం కాలేదు, దళారులు నాశనం చేస్తోంది అడవుల్ని కాదు తమ జీవితాల్నీ అని. చెట్లను విపరీతంగా నరికేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ప్రాంతంలో నేలపైన సారవంతమైన పైపొర కొట్టుకుపోయి, భూములన్నీ నిస్సారంగా మారాయి. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయానికి కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమైంది. నెమ్మదిగా వలసలూ, ఆకలి చావులూ, ఆత్మహత్యలూ మొదలయ్యాయి. దైవంలా చూసుకునే అడవిలోని చెట్లని కొట్టి అమ్ముకొని గ్రామస్థులు పొట్ట పోసుకోవడం మొదలుపెట్టారు. ఇరవై ఎనిమిదేళ్ల వయసులో సైమన్ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. గ్రామంలో అన్ని ఇబ్బందులకూ కారణం నీటి కరవే. వర్షాకాలంలో కురిసే వానలే అక్కడ నీళ్లకు ఆధారం. వాటిని భద్రపరచుకోగలిగితే నీటి కొరతను కొంత వరకూ జయించొచ్చని అనుకున్నాడు

కష్టాలకుచెక్‌’డ్యామ్లు... 
వానాకాలంలో నీటిపాయలు కొండల నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయేవి. సైమన్ నీటిధార ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి కొన్ని మైళ్ల దూరం నడిచాడు. వర్షపు నీళ్లు అడవిలో, కొండలపైన ఎక్కువగా నిలుస్తోన్న ప్రాంతాలను గుర్తించాడు. వాటి పరిసరాల్లో చెక్డ్యామ్లు నిర్మించి, నీటిని కుంటల్లోకీ, పొలాల్లోకీ మళ్లిస్తే నీటి సమస్య తగ్గుతుంది అనిపించింది. కానీ దానికోసం గ్రామస్థుల పొలాల్లో కొంత భాగం మునిగిపోతుంది. దాంతో చాలామంది డ్యామ్ నిర్మాణానికి ఒప్పుకోకపోవడంతో, సైమన్తన పదెకరాల పొలాన్నీ ముంపు బాధిత రైతులకు ఇచ్చేశాడు. కొందరు కుర్రాళ్ల సాయంతో వర్షపు నీటి ప్రవాహాలకు అడ్డంగా మట్టితో చెక్డ్యామ్లు నిర్మించి నీటిని బావులవైపు మళ్లించాడు. తొలి రెండేళ్లూ వర్షాల ధాటికి డ్యామ్లు కొట్టుకుపోయాయి. దాంతో మూడో ఏడాదికి అధికారుల కాళ్లావేళ్లా పడి కాంక్రీట్డ్యామ్లు నిర్మించాడు. వాటి ఆధారంగా గ్రామ చుట్టుపక్కలున్న బావులూ కుంటల్లోకి వర్షపు నీరు చేరేలా కాల్వలు ఏర్పాటు చేశాడు. కొత్తగా చెరువులు తవ్వించాడు. క్రమంగా భూగర్భ జల మట్టం పెరిగింది. పొలాలు వ్యవసాయానికి అనువుగా మారాయి. విజయం ఇతర గ్రామాలనూ ఆకర్షించి వాళ్లూ సైమన్ను ఆశ్రయించారు. అలా ఒక్కో గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టిన సైమన్‌, కొన్నేళ్ల వ్యవధిలో జిల్లాలోని 51 గ్రామాల్లో నీటి కరవును దూరం చేశాడు.గ్రామాలు మారిపోయాయి 
అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమేనని సైమన్కి తెలుసు. అందుకే కుర్రాళ్లను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటు చేశాడు. గతంలో చెట్లను నరికేసిన ప్రాంతంలో 35వేలకు పైగా చెట్లను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఫలితంగా నేల సారవంతమైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంటే వేస్తే, 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితో సహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఆత్మహత్యలూ, వలసలూ తగ్గి చాలా కాలమైంది. తొలిసారి పిల్లలు మంచి స్కూళ్లకెళ్లి చదువుకుంటున్నారు. గ్రామాల నుంచి లక్షలు విలువ చేసే 20వేల మెట్రిక్టన్నుల కూరగాయలు ఏటా గుజరాత్‌, పశ్చిమబంగా, బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దాంతో బీడోని అక్కడి ప్రభుత్వంఅగ్రికల్చరల్హబ్ఆఫ్జార్ఖండ్‌’గా గుర్తించింది. సైమన్ను వాటర్షెడ్ల కార్యక్రమానికి బ్రాండ్అంబాసిడర్గా నియమించింది. అతడి ప్రస్థానంపైన సారా అనే కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థిని పీహెచ్డీ చేసింది. వృద్ధాప్యం మీదపడినా ఇప్పటికీ సైమన్ఏటా వెయ్యి మొక్కలను నాటడంతో పాటు వాటి బాగోగులనూ చూసుకుంటున్నాడు

సైమన్లా ఇబ్బందులు ఎదుర్కొన్నాక పరిష్కారాన్ని వెతుకుతామా, లేక అజాగ్రత్త వల్ల ఎదురయ్యే సమస్యలను ముందే వూహించి వాటిని నివారించడానికి మనవంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తామా అన్నది మన చేతుల్లో పనే కదా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి