31, జులై 2016, ఆదివారం

చౌడు నేలలో బంగారం దిగుబడి!

చౌడు భూముల్ని సారవంతంగా మార్చి, పామాయిల్సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతు. పామాయిల్లో అంతర్పంటలుగా కోకో, నారింజ, నిమ్మ సాగు చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ఖర్చులు తగ్గించుకుని సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కర్రి రామకృష్ణారెడ్డి విజయగాథ ఇది...

ఆయన వయసు 76. వ్యవసాయంలో ఆయన ప్రయోగాలు చూసి యువకులు సైతం ఔరా అంటున్నారు. చౌడు భూముల్లో పామాయిల్సహా వివిధ రకాల పంటలు పండించారు. ఏది సాగుచేసినా లాభాలు పండించడం ఆయన ప్రత్యేకత. రైతు పేరు కర్రి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరిజిల్లా ప్రత్తిపాడు ఆయన ఊరు. శానిటేషన్కోర్సు చేసిన ఆయన 1998లో రిటైర య్యారు. ఆదినుంచీ వ్యవసాయంపై ఆసక్తిగల ఆయన రిటైరయ్యాక మరింతగా దృష్టి సారించారు. ప్రత్తిపాడులో తన 16ఎకరాల చౌడు భూమిని వ్యవసాయక్షేత్రంగా మలచాలని సంకల్పించారు. వేసవిలో పొలంలో చీమల పుట్టలు పెరిగిన ప్రదేశాలను గుర్తించారు. అక్కడ బోరు వేస్తే నీళ్లుపడతాయని భావించారు. ఆయన అంచనా నిజమైంది. నీళ్లు పడ్డాయి. అలానే మరో మూడు బోర్లువేశారు. దీంతో చౌడు భూమి కాస్తా సస్యశ్యామలమైంది. భూమిలో 2004 జనవరి లో బిందుసేద్యం పరికరాలు అమర్చి పామాయుల్సాగు చేపట్టారు. ఆరో ఏట నుంచే దిగుబడి వచ్చేలా తోటను అభివృద్ధిచేశారు. దీంతో ఏటా ఎకరాలో 14-15 టన్నుల దిగుబడి సాధించి అందర్నీ ఆకర్షించారు. పామాయిల్తోటలోనే అంతర పంటగా కోకో, నారింజ, నిమ్మ సాగుతో అదనపు లాభం ఆర్జిస్తున్నారు. అంతటితో ఆగక మరో పదెకరాలు తీసుకుని అభివృద్ధి చేశారు.

ప్రయోగాలతో ఫలితం
బాల్యంనుంచే ఎన్నో ప్రయోగాలు చేశారా యన. రామాఫలం-సీతాఫలం విత్తనాలు కలిపి నాటి, వేసవిలో వృక్షాల నుంచి రెండురకాల ఫలాల దిగుబడి సాధించిన ఘనపాఠి ఆయన. ప్రస్తుతం షుగర్ఫ్రీ సుగంధ సాంబ వరిని, సుమతి పేరుతో బిర్యానీరైస్ను పండించి కొత్త వంగడాలను రైతులకు అందిస్తున్నారు. అలాగే అరటి, అల్లం, కర్రపెండలం సాగుతో లాభాలు గడిస్తున్నారు. సేంద్రి పద్ధతిలో అధికదిగుబడి సాధించడంలో ఆయనది అందె వేసిన చేయి. 15 పాడిగేదెలతో డెయిరీకూడా నిర్వహిస్తూ ఘన జీవామృతం, గోమూత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. పొలాల్లో వర్మి కంపోస్టు యూనిట్ల ఏర్పాటుతోపాటు అజుల్లా (నాచు)వంటివి తయా రుచేస్తున్నారు. పశుదాణా ఖర్చును రోజుకు రూ.25నుంచి రూ.2కు తగ్గించగలిగారు. కొన్నిరకా మొక్కల ఆకులకు చీడపీడలు ఆశించకపో వడాన్ని గుర్తించారు రామకృష్ణారెడ్డి. ఆదిశగా ప్రయోగాలు చేశారు. మొక్కలనే చీడపీడల నివారణకు ఉపయోగించి దిగుబడి ఖర్చులు తగ్గించుకోవడంలో విజయం సాధించారు. పామాయిల్తోట మధ్యలోగల మామిడి చెట్టుపై పలు ప్రయోగాలు చేశారు విద్యుద్దీపాల సాయంతో చెట్టు విరగబూసేలా చేయడంతో పాటు అధిక దిగుబడి సాధించారు. ఏడున్నర పదుల వయసు దాటినా రామకృష్ణారెడ్డి హుషారుగా పొలం పనులు చేసుకుంటారు. యోగసాధన, పరిమిత ఆహారం తన ఆరోగ్య రహస్యాలని చెబుతారాయన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి