10, ఆగస్టు 2016, బుధవారం

కళ్లకు గంతలు కట్టి ఒంటెద్దుతో పదెకరాల్లో విత్తనం

ఆత్మకూరు (అనంతపురం), ఆగస్టు 10: పశువులను మచ్చిక చేసుకుంటే అవి మనం చెప్పినట్లే నడుచుకుంటాయని రైతు నిరూపించాడు. సాధారణంగా పొలం దున్నేటప్పుడు, విత్తనాలు నాటేటప్పుడు ఎద్దులను కాడికి కట్టి, పగ్గాలు చేతబూని ముళ్లుకర్రతో అదిలిస్తేకానీ అవి మాటవినవు. కానీ, అవేమీ లేకుండానే బుధవారం అనంతపురం జిల్లా ఆత్మకూరు రైతు కందులు లోక్నాథ్రెడ్డి తన కాడెద్దుల్లో ఒకదానితో ఏకంగా పదెకరాల్లో విత్తనాలు నాటాడు. పైగా దాని కళ్లకు గంతలు కట్టి పనిచేశాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 2గంటలకు పూర్తి చేసి భళా అనిపించుకున్నాడు. దీని చూసేందుకు స్థానిక రైతులు వందలాదిగా తరలివచ్చారు. రైతును గ్రామాలలో ఉత్సాహంగా ఉరేగింపు చేశారు. సాధారణంగా రెండు ఎద్దులు ఉండేనే విత్తనాలు నాటడం సాధ్యమని, దీనిని ఒంటేద్దుతోనే పూర్తి చేసి లోక్నాథ్రెడ్డి ఘనత చాటారని రైతులు అభినందించారు. అనంతరం లోక్నాథ్రెడ్డికి పి.నారాయణపురం రైతు వెంకటనారాయణరెడ్డి స్వయంగా తయారు చేసినవిత్తనాలు నాటే ఎద్దు ప్రతిమను బహుకరించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి