1, జనవరి 2014, బుధవారం

వ్యర్ధాలను, విసర్జితాలను ఎరువుగా మార్చడం

పర్యావరణం


ప్రతి రోజు చాలా వ్యర్ధాలను చూస్తుంటాము. అవసరం లేని పదార్ధాలను వ్యర్ధాలు అని అంటాము. వ్యర్ధ పదార్ధాలు ప్రజల ఆరోగ్యానికి, ప్రమాదకరంగా మారుతున్నాయి. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న వ్యర్ధ పదార్ధాలను సరైన పద్ధతిలో నిర్మూలన, నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యర్ధాలను మూడు రకాలుగా విభజించవచ్చు.

  • మొక్కల వ్యర్ధాలు : ఎండిన ఆకులు, కొమ్మలు, పువ్వులు మొదలైనవి.
  • పశువుల వ్యర్ధాలు : పశువుల మూత్రం, పేడ, కుళ్ళిన మేత మొదలైనవి.
  • ఇంట్లోని వ్యర్ధాలు : మనిషి మల మూత్ర విసర్జన, ఇంటి వంటిoటి గదిలోని చెత్త మొదలైనవి.
ఈ వ్యర్ధాలు రెండు రూపాలలొ వుంటాయి
  • ఘన రూపం
  • ద్రవ రూపం
ఘన రూపం వ్యర్ధాలు :
  • విసర్జితాలు, వృధా నీరు కాకుండా ఇతర యే వ్యర్ధలైన ఘన వ్యర్ధ పదార్ధాలు అంటారు. వీటిలో కొన్ని భూమిలో కుళ్లేవి వీటితో జీవన ఎరువును తయారుచేసుకోవచ్చు. మరికొన్ని కుళ్ళినవి కుళ్ళినవాటితో పునర్వినియోగానికి అనుకూలంగా వుంటాయి.

కంపోస్ట్ గుంత నిర్మాణం
కుళ్లే ఘన వ్యర్ధ పదార్ధాలను ఒక గుంతలో వేస్తే జీవ రసాయనక చర్య వలన అవి కుళ్ళి జీవ ఎరువుగా మారతాయి. దీనినే కంపోస్ట్ గుంత అంటాము.
  • 1 మీ × 1 మీ ×1/2 మీ పరిమాణంలో గుంతని ఇంటి ఆవరణంలో ఒక మూల అంతగా వాడని ప్రదేశం లో తవ్వాలి. ప్రతిరోజు వచ్చే వ్యర్ధ పదార్ధాల పరిమాణాన్ని బట్టి గుంత పరిమాణం నిర్ణయించుకోవచ్చు.
  • గొయ్యి ఆడుగున 8 అంగుళాలు మేర కొబ్బరి పీచు లేక ఎండు గడ్డి వంటి పీచుపదార్ధం, దాని ఫై 4 అంగుళాలు మేర తుమ్మ, కానుగ, పెసర ఆకులు, కొమ్మలు వంటి ఆకుపచ్చని పదార్ధాలను వేయాలి.ఈ పొరల ఫై ఆవు పేడ లేక తడిమట్టిని లేక రెంటిని వెయ్యాలి .
  • పశువుల మల మూత్రాలు, ఇతర వ్యర్ధ పదార్ధాలను ప్రతిరోజు గుంత లోకి వేసి ఎప్పటికపుడు దానిని సమంగా సర్దాలి. వ్యర్ధపదార్ధాలు పెద్ద పెద్ద పరిమాణంలో వుంటే వాటిని ముక్కలుగా చేసి వేయాలి.
  • ప్లాస్టిక్ వస్తువులు, నిర్మాణ సామగ్రి వంటి కుళ్ళని పదార్ధాలను వెయ్యరాదు.
  • ఆరంగుళాల మేర వ్యర్ధపదార్ధాలు వేశాక దాని ఫై ఎండుగడ్డిని పరిచి కొద్దిగా యూరియ కలిపిన నీటిని చిలకరించాలి, లేదా పశువుల కొట్టం కడిగిన తరువాత వచ్చే నీటిని అందులో పడేలా చేయాలి.అందువల్ల గుంత పదార్ధం త్వరగా కుళ్ళుతుంది.
  • గుంత పూర్తిగా నిండాక దానిని గడ్డితో కప్పి గట్టిగ తొక్కాలి.దాని ఫై బరువుకోసం రాళ్లు ఉంచవచ్చు.
  • 15-20 రోజులకొకసారి ఫై గడ్డి తీసి ఒకసారి అంతా కలియతిపాలి.
  • 60-70 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది
ఇంకుడు గుంత
  • మూత్ర నాలల నుండి నీటిని వ్యర్ధాలను ఇంకుడు గుంతలోకి మళ్ళించాలి. మన వీలుకు అనుగుణంగా త్రవ్వుకోవచ్చు. వర్షపు నీటిని కూడా అందులోకి మళ్ళించ దలిస్తే, గుంతను ఇంటి ఆవరణలో బాగా పల్లంగా వున్నా చోట తవ్వాలి. తదనుగుణంగా కాలువను వాలుగా ఏర్పాటు చేసుకోవాలి. 2మీ×1మీ×1మీ. మీ సైజులో గొయ్యి తవ్వాలి. అందుబాటులో స్థలాన్ని బట్టి పరిమాణం నిర్ణయించుకోవచ్చు.
  • గుంత అడుగున మూడింట ఒక వంతు వరకు పెద్ద సైజు రాళ్ళను (4-5 అంగుళాల వ్యాసం గలవి) నింపాలి.
  • వాటిఫై మరో వంతు చిన్న సైజు రాళ్ళను వెయ్యాలి (1-2 అంగుళాల వ్యాసం కలవి)రాళ్ళను వేయాలి.
మొక్కలకు మళ్ళించడం
  • నీరు నిలువ ఉంటె ప్రమాదకరం, అందువల్ల వాటిని పెరటి తోటకు వినియోగించి కూరగాయల రూపంలో లబ్ది పొందవచ్చు. నీరు స్నానాల గది నుండి, అంట్లు తోమే ప్రాంతం, బట్టలుతికే ప్రాంతం, వంట గది నుండి వచ్చే నీటిని మొక్కలకు కాలవల ద్వారా మొక్కలకు మళ్ళించాలి.
డాక్టర్. జి.మాధురి, అధ్యాపకులు ,AMR-APARD,HYDERABAD
కుమారి. వై.లిల్లి నిర్మలా శాంతి, విద్యార్ది, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/047.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి