27, డిసెంబర్ 2013, శుక్రవారం

ఇంకుడుగుంతలు


గత కాలంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనె లభ్యమయ్యేవి. వర్షాభావం వల్ల, అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన భూగర్భ జల మట్టం రాను రాను క్రిందికి పోతున్నది. పాతాళ జలం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. వెయ్యి అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు. 300-400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి. అవి తాగడానికి పనికిరావని నిపుణులు చెబుతున్నారు. దీని వలన పర్యావరం లో మార్పులు చాల త్వరగా వచ్చే అవకాశమున్నది. ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా విన్నది. ఈ కార్య క్రమాన్ని వ్వక్తి గతంగానే కాకుండా సామాజిక పరంగా కూడ బారి ఎత్తున చేపట్ట గలిగితే సరైన ప్రతి ఫలము పొంద గలరు

ఇంకుడు గుంతలే వాన నీటి సంరక్షణకు ఏకైక మార్గం

మన ఇంటి ఆవరణలో ఉన్న బోరు బావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందడానికి వాన నీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. ఇంకుడు గుంతలు తవ్వే విధానం:- 250 గజాల నుండి 500 గజాల స్థలములో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి. గుంట లోపల నలుగు వైపులా అడుగు భాగములో ఎక్కడా సిమెంట్ ప్లస్తింగ్ చేయకూడదు. మట్టి గుంటలో సగ భాగం అంటే 4 అడుగుల మేర 60mm లేదా 40mm గ్రానైట్ రాళ్ళు వేయాలి. వాటిపైన 2 అడుగుల మేర 20mm కంకర చిప్స్ వేయాలి. దానిపై 3 అంగుళాలు మాత్రమే బటాణ (గులక రాళ్ళు) లేదా దొడ్డు ఇసుక వేయాలి ఇలా చేయగా మిగిలిన 1. అంగుళాల గుంట లోపలి భాగమున మాత్రమే సిమెంట్ ప్లాస్తింగ్ చేసుకోవాలి. ఆ తరువాత 1. అంగుళాల ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచాలి. గుంట చుట్టూ 9 అంగుళాల గోడ భూమి పైనుండి 6 అంగుళాలు లేదా 1 అడుగు పైకి కట్టుకోవాలి. ఆ తరువహ్త ఇంటి పై భాగం మీద పడే వాన నీరు ఇంకుడు గుంత లోనికి వచ్చే విధముగా 6 అంగుళాలు పైపును ఇంటి పై భాగం నుండి ఇంకుడు గుంట లోనికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధముగా నిర్మించిన ఇంకుడు గుంత ఎంత పెద్ద వాన కురిసిన ఆ నీటిని పీల్చుకోగలుగుతుంది.

ఇలా చేస్తే..

100 చదరపు మీటర్ల పై కప్పు ఉన్న ఇంటి ఆవరణలో వర్షం కురిసినప్పుడు ఇంకుడు గుంత ద్వారా 55 క్యూబిక్ మీటర్ల ఘనపరిమాణం గల నీటిని భూమిలోకి ఇంకేలా చేయవచ్చు. ఇది 55 వేల లీటర్ల నీటితో సమానం. రెండు లక్షల యూనిట్లలో వర్షపు నీటి సేకరిస్తే, అది ఐదుగురు సభ్యులున్న రెండు లక్షల కుటుంబాలకు 100 రోజుల నీటి అవసరాలకు తీరుస్తున్నది.

ఇంకుడుగుంతలతో లాభాలు

  • భూగర్భ జలాలు అడుగంటవు.
  • తాగు, సాగు నీటి సమస్య ఉండదు.
  • మురుగు నీరు రోడ్లపైకి రాదు.
  • దుర్గంధం రాదు
  • ఈగలు, దోమల సంతతి పెరగదు.
  • వ్యాధులు దరిచేరవు.
  • మురుగు కాల్వల నిర్మాణం అంతగా అవసరముండదు

 
డబ్బు లేకపోయినా మనిషి బ్రతికే అవకాశాలు ఉన్నాయి కానీ తాగడానికి నీరు లేకుంటే బ్రతకడం అసాధ్యం. నేటి చిన్న చిన్న పోదుపులే రేపు మన జీవన ఆధారంగా మారుతాయి. అలానే మనం వృధా చెయ్యని ఒకో బొట్టు, రేపు మనకీ మన భవిష్యత్ తరాలకి ఉపయోగపడతాయి. నేడు మన దేశంలో సరైన వర్షాలు పడక, నీటి కొరత వల్ల, భూములు ఎండిపోయి, పండించే పంట చేజారిపోయి, దేవుని ప్రార్ధించినా లాభం లేక, ఎంతోమంది  రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా అన్నదాతలే చనిపోతే మనకి అన్నం పెట్టె వారు ఎవరు? ఇలా ప్రపంచంలో నీటి కొరత లేని ప్రదేశాలు ఎన్నున్నాయి? దీనికి పరిష్కారం ఏంటి అని, ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? 
గంగి గోవు పాలు గరిటడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు..... అనే పద్యం చదివే ఉంటారు. భూమిని 71 శాతం నీరే ఆక్రమించింది. దానిలో 96.5 శాతం సముద్రపు నీరు. దానిలో నుండి ఒక చుక్కైనా తాగడానికి పనికొస్తుందా? మిగిలిన 3.5 శాతం నదులుగా, చెరువులుగా ఉన్నాయి. కాని ఆ నీరు సరైన చోటికి చేరే మార్గమేది?
ఇక నగరాల విషయానికొస్తే, 95 శాతం వరకు వర్షపు నీరు, కాలుష్యం లేక వృధా నీటిలో కలిసిపోతుంది. ఈ నీరునే కనుక సరైన పద్ధతిలో బద్రపరచుకుంటే, రాబోయే కాలంలో నీటి కొరత అనే మాటకు స్థానం ఉండదు.

మనం జీవితాంతం వాడుకునే విధంగా, కేవలం 2 నుండి 4 వేల ఖర్చుతో వర్షపు నీటిని ఎలా బద్రపర్చుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం:
వర్షపు నీటిని తిరిగి వాడుకోడానికి రెండు విధాలు ఉన్నాయి. ఒకటి మన ఇంటిపైన పడే వర్షపు నీటిని, కంకర, ఇసుక, బొగ్గుతో చేసిన ఫిల్టర్ ద్వారా సంపులో లేక ట్యాంకులో పట్టి పెట్టుకోవడం. రెండవది అదే ఫిల్టర్ సాయంతో ఇంకుడు గుంత నిర్మించి వర్షపు నీటిని తిరిగి మన ఇంట్లో లేదా పొలంలో ఉన్న బోరువద్ధ ఇంకి పోయేలా చేయడం. దీనినే వాటర్ రీచార్జ్ అంటారు. 
ఫిల్టర్ కొరకు కావాల్సిన సామాగ్రి:

పెద్ద కంకర
ఇసుక
బొగ్గు
చిన్న కంకర
పీవీసీ పైపులు

కింద చిత్రంలో చూపించిన విధంగా, ట్యాంకులో ముందు 25 సె.మీ ఎత్తు వరకు పెద్ద కంకర నింపాలి, దానిపై 25 సె.మీ ఇసుక, దానిపై 10 సె.మీ బొగ్గు, 10 సె.మీ చిన్న కంకర నింపుకొని, వర్షపు నీరు ఇంటిపై నుండి కింద ఉన్న ట్యాంకులోకి  వచ్చేలా అమర్చుకోవాలి.
ఫిల్టర్ ను ట్యాంకు పైన లేదా నీరు వచ్చే దారి మధ్యలో వేరే ఎక్కడైనా ఉండేలా అమర్చుకోవాలి. ఫిల్టర్ ఉంటేనే కాలుష్య నీరు కాకుండా స్వచ్చమైన నీరు ట్యాంకులో/సంపులో వచ్చి చేరుతాయి. వర్షం పడిన వెంటనే ముందుగా వచ్చే చెత్తతో కూడిన నీరు ఫ్లష్ లో నిండుతాయి. ఫ్లష్ లో నిండిన నీరును వెంటనే, ఆ పైపుకు ఉన్న మూత తీసి వదిలేయాలి. తిరిగి మూత పెట్టిన తరువాత వర్షపు నీరన్ని ట్యాంకులో/సంపులో వచ్చి చేరుతాయి.
ఇదే విధంగా భూమిలోకి బోరు పైపు వెళ్ళే దారి పక్కన 1x1x1 మీటర్ల (ఎత్తు, రెండు వైపులా వెడల్పు) గల ఇంకుడు గుంత తవ్వి, చిత్రంలో చూపించిన విధంగా దానిలో కంకర, ఇసుక, బొగ్గు నింపాలి. ఈ ఇంకుడు గుంత వద్దకు వర్షపు నీరు చేరేలా దారి చేస్తే చాలు, ఎండా కాలంలో నీటి కొరత నుండి తప్పించుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి